
*కడలి న్యూస్:-* ఒకప్పుడు అసలు ఒడిశా రాష్ట్రం అనేది ఒకటి ఉందా అనే విధంగా ఉండేది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరు మారు మోగుతుంది. స్వంతంగా ఎక్కడ పబ్లిసిటీ లేదు...
ఎక్కడ ఎవ్వరు విమర్శలు చెయ్యరు...
ఏ రోజు నాకు కేంద్రం సహాయం చెయ్యలేదు అనే మాట లేదు...
ఒరిస్సా రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎవ్వరూ..
ఒరిస్సా రాష్ట్ర ఎంపీలు ఎవ్వరూ అని కూడా జనం కి తెలియదు...
కేంద్రం పై ఒక్క రోజు కూడా ఒక్క మాట లేకుండా ఒక్క విమర్శ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయే వ్యక్తి నవీన్ పట్నాయక్
ఇప్పుడు చిల్లరగా రాజకీయాలు చేసే సీఎంలు వారి బానిసలు ...ఒరిస్సా కి రాని సమస్య మిగతా రాష్ట్రాలకి ఎలా వస్తున్నాయి...
రాజకీయ క్రీడలు మాత్రమే ఇవి...
ఒకడు కేంద్రం పై యుద్దం అంటాడు..ఇంకొకడు ఫ్రంట్ టెంట్ అంటాడు...
2000 సంవత్సరం నుండి ఒరిస్సా సీఎం గా నవీన్ పట్నాయక్ ఉన్నారు.
ఇన్ని సార్లు గెలిచిన ఎక్కడ అహం లేదు...
కుళ్ళు లేదు...
నాయకుడు అంటే తను చేసిన పని చూసి ప్రజలు ఓటు వెయ్యాలి అంతే కానీ పక్కన వారి పై బురద చల్లి కాదు అనే ధోరణిలో పాలన సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హ్యాట్సాఫ్ నవీన్ పట్నాయక్ గారు..god bless u...
'ఇద్దరు స్వలాభం లేని వారసుల గోల లేని వారి పనితీరుకు ఇది రెండో నిదర్శనం..
అప్పట్లో అర్ధరాత్రి నవీన్ పట్నాయక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అర్ధరాత్రి సమయంలో కాల్ చేసి మా టెస్టింగ్ కిట్లు ఇరుక్కున్నాయ్ వాయుసేన ప్రత్యేక విమానంలో వాటిని భువనేశ్వర్ చేర్చాలి అని అడిగితే యుద్ధ ప్రాతిపదికన ఆ టాస్క్ పూర్తి చేశారు మోడీజీ.. ఇప్పుడు కరోన రెండో వేవ్ సమయంలో ప్రధానికి స్వయంగా ఆయన కాల్ చేసి మా దగ్గర ఆక్సిజన్ ఉంది మీరు రవాణా ఏర్పాట్లు చేస్తే మేము అందిస్తాం అంటే.. ప్రధాని మోడీ రైల్వే గ్రీన్ కారిడార్ (గ్రీన్ కారిడార్ అంటే ప్రధాని రాష్ట్రపతి లాంటి వాళ్ళు ప్రయాణించే సమయంలో ఆ రైలు ఎక్కడ ఆగకుండా ప్రత్యేక లైన్ ఇస్తారు అది) వాయుసేన ప్రత్యేక విమానాలు ఏర్పాట్లు చేసి ఒరిస్సా నుంచి ఆక్సిజన్ దేశ వ్యాప్తంగా అవసరం ఉన్న చోటుకి తరలించే ఏర్పాట్లు చేశారు.. ఆ ఆక్సిజన్ ట్యాంకర్లు రైల్ మరియు విమానాశ్రయం చేరేందుకు వాటికి జీపీఎస్ టాగింగ్ అలాగే మార్గమధ్యంలో ఆటంకాలు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మరీ వాటిని గమ్యం స్థానాలకి చేర్చారు.. ఈ ప్రక్రియ ద్వారా ఒరిస్సా నుంచి టన్నుల టన్నుల ఆక్సిజన్ నిశ్శబ్దంగా నిర్ధేశిత గమ్యాలకు చేరుతోంది.. ఎక్కడ హడావిడి లేదు ప్రచార ఆర్భాటాలు లేవు.. ఇది కదా పాలన అంటే ఇలాంటి వారు కదా మనకి కావలిసిన పాలకులు..
Post a Comment
Post a Comment