పర్వతాలు స్థిరంగావుండవు పెరుగుతూనే వుంటాయి.

Post a Comment

గుట్టలు, కొండలు, పర్వతాలు, శిఖరాలగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నవాటిని గుట్టలని, ఇంకాస్తా పెద్దవాటిని కొండలని, పూర్తిగా పెద్దవాటిని పర్వతాలని చెప్పుకోవాలి.  పైభాగం సూచిలా పొడుచుకు వచ్చిన పర్వతాలనే శిఖరాలు అనంటారు.

భూమిలోపలి పలకాలు నిరంతరం చలిస్తూవుంటాయి. ఆ పలకాలచలనంలో ఒకదాని మీద ఒకటి పడినపుడు భూమిపైకి జొచ్చుకువస్తాయి. అలా పైకి పొడుచుకు వచ్చినవే గుట్టలు కొండలు పర్వతాలు. భూకంపాలవలన కూడా  పర్వతాలు ఏర్పడిన సందర్భాలున్నాయి.

భౌతికశాస్త్రవేత్తల అంచనాల ప్రకారం పర్వతాలు స్థిరంగా వుండవు. చలిస్తూవుంటాయి.కాకపోతే ఆ చలనం ఊర్థ్వదిశలో (పైకి) పెరుగుతున్నాయి. పెరగడమనే మీటర్లలోనూ సెంటీమీటర్లలోనూ వుండవచ్చును.

ఆసియాఖండం భారతఖండాల లోపలి భూఖండాలు ఒకదానితో ఒకటి ఒత్తిడిపడటం వలన ఏర్పడినవే హిమాలయ పర్వతాలు. అలాగే రాకీ, ఆల్ఫ్స్, కకాసాస్, యాండీస్ పర్వతాలు కూడా.

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం హిమాలయాలలోని ఎవరెస్ట్ శిఖరం. ఎత్తు 8848 మీటర్లు లేదా 29021 అడుగులు.

8611 మీటర్ల ఎత్తుతో రెండవ స్థానాన్ని అక్రమించిన పర్వతం కాంచనగంగ.దీనినే K2 అంటారు.

ద.అమెరికాలో ఆకోన్ కాగువ పర్వతం ఎత్తైనది. ఎత్తు 6960 మీటర్లు.

అమెరికాలో ఎత్తైనపర్వతం మౌంట్ మెక్ క్లీనే. ఎత్తు 20,319 అడుగులు.

ఆఫ్రికాలోనైతే 5895 మీటర్ల ఎత్తుతో కిలిమంజారో పర్వతం అతిపెద్దది.

యూరప్ లోనైతే రష్యాలోని ఎల్బస్ పర్వతం పెద్దది. ఎత్తు 5642 మీటర్లు.

ఆస్ట్రేలియాలో 4884 మీటర్ల ఎత్తుతో విల్ హేలం పర్వతం పెద్దదిగావుంది.

Related Posts

Post a Comment