ఇనుపఎడ్లు అంటే ఏమిటో తెలుసుకొందాం

Post a Comment

(1) గుడి అంటే నివాసం, దేవాలయమనే అర్థాలున్నాయి.

(2) గుడికట్టు అంటే దేవాలయానికి ఇవ్వబడినభూమి, గ్రామానికి సంబంధించిన మొత్తం భూమి,దేవాలయంపై విధించిన పన్ను అనే అర్ధాలున్నాయి.

(3) గుడికొలువు అంటే గుడికోసం పనిచేసే సేవ. పూజారి, పురోహితుడు, జ్యోతిష్యుడు, ధర్మకర్త, నాయిబ్రాహ్మణులు, దేవదాసి, బసివిరాండ్రు/బసివినీలు, మాలకారులు మొదలైనవారు గుడికొలువులో వుంటారు.

(4) గుడిపాత్ర లేదా గుడిసాని అనగా గుడిలోనాట్యం చేసే స్త్రీ. దేవదాసీ, బసినీలు, ఆస్థాననాట్యకత్తెలు మొదలైనవారు.

(5) గుడిభోగం అంటే గుడినిర్వహణకొరకు ఇచ్చిన సంపద, భూములు, గోసంపద, ఇనుపఎడ్లు, బంగారు, ఇతర ఆభరణాలు మొదలైనవి.

(6) గుడిమంటపం.దీనిగురించి వివరణ అవసరంలేదనుకొంటా.

(7) గుడిమణియం అంటే. గుడిబాగోగులు చూచే అధికారి, స్థానకర్త.

(8) గుడిమాని అంటే గుడికొలువులో వుండేవారుకాకుండా అదనంగా దేవాలయానికి సేవచేసేవారు.

(9) గుడివడుగు అంటే దేవాలయపుజారి.

(10) గుడివ్రిత్తి అంటే దేవాలయంలో నిత్యం జరిగే కైంకర్యాలు జరిగేటందుకు ఇచ్చిన సంపద.

(11) గుడిసాని అంటే దేవదాసి లేదా బసివినీ.

(12) తిరుమాడలు అంటే వైష్ణవ గురువులు నివసించే గృహసముదాయం. నేడు వీధులనే అర్థంలో వాడుతున్నట్లుగావుంది.

(12) తిరుమజ్జనం అంటే దేవుడికి చేసే అభిషేకం. దేవవిగ్రహాలకు స్నానం చేయించుట. ఎందుకంటే విగ్రహమలినాలు తొలగించి శుభ్రపరిచేటందుకు.

(13) తిరుపడి అంటే భోజనపదార్థాలు. ఇపుడేమైనా వంటశాల అంటున్నారా ?

(14) దీపారాధన అంటే దేవాలయంలోకాని గృహంలో కాని దేవుడిఎదుట దీపం వెలిగించి దేవతార్చన చేయుట.

(15) దేవస్వం అంటే దేవుడికి ఇచ్చినభూమి. దీనికే దేవరపొలం, దేవక్షేత్రమనికూడా అంటారు.

(16) దేవరతలారి అంటే దేవాలయ రక్షకులు.బోయవారు.

(17) దేవాగ్రహారం అంటే దేవాలయ నిర్వహణకై ఇచ్చిన గ్రామం.

(18) కూడుజీతం అంటే దేవాలయంలో కూటికై అంటే అన్నదాన నిర్వహణకు దానం చేసినభూమి.

(19) కప్పడం అంటే గుడిలోని సన్యాసులు ధరించు వస్త్రవిశేషం.

(20) దశ వాహనాలు అనగా దేవుడిఉత్సవ విగ్రహాలను ఊరేగించుటకు ఉపయోగించు పది వాహనాలు. అవి వరుసగా

 (1)హంస (2) సింహ (3) గరుడ (4) శేష (5) ఆంజనేయ (6) సూర్యచంద్రులు (7) రథ (8) అశ్వ (9) గజ (10) పుష్ప వాహనాలు.

ఇనుప ఎడ్లు అంటే  గొర్రెలు మేకలు గేదెలు.

Related Posts

Post a Comment