🚩 🦜 🚩 🦜ధర్మో రక్షతి రక్షితః 🚩 🦜 🚩 🦜

Post a Comment

🦜 జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు.

🦜 మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. 

🦜 మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే.

🦜ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది.

🦜 ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి.

🦜ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతోంది.

🦜 శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటాడు.

🦜 అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి.

🦜 అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు.

🦜 మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో విపులంగా వివరించి చెప్పింది మహాభారతం.

🦜 ఏ కర్మలైతే మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో ఆచరించకూడదు.

🦜 అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ చెబుతాడు.

🦜 వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పినవాటిని అర్ధశ్లోకంలో వివరిస్తున్నానని ఈ విధంగా ఉపదేశిస్తారు.

🦜 ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది. ఇదే అసలైన ధర్మసూక్ష్మం.

🦜 ధర్మాచరణమే పరమధర్మమని, సచ్ఛీలమే తపస్సని, సచ్ఛరిత్రమే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు.

🦜 బ్రహ్మచారి అయిన శ్రవణ కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూ, వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రుల సేవచేస్తూ ఆత్మశక్తిని పెంపొందించుకున్నాడు.

🦜 ధర్మవ్యాధుడు స్వధర్మ ఆచరణతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు సేవచేస్తూ వేదవిహిత కర్మలతో తపోశక్తిని సాధించిన కౌశికుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేశాడు.

🦜  కుక్కుటముని తనకు సమీపంలో ఉన్న గంగను, కాశిని సేవించక తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు.

🦜 అందుకే మనిషి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి.

🦜 ధర్మాచరణతో అందరికీ తోడ్పడాలి.

🦜 భోగాలను విడిచి త్యాగగుణం పెంచుకొమ్మంటుంది ధర్మం.

🦜 అహంకారం వదిలి ఆత్మతత్వం గ్రహించమని చెబుతుంది.

🦜 యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడు తల్లిదీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించమంటాడు.

🦜 అప్పుడు గాంధారి, ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని దీవిస్తుంది.

🦜 ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు.

🦜 ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతిలో ఇలా వివరిస్తాడు. ..

🦜 మానవుడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమిపైన, గోసంపదను పశువుల శాలలో విడిచి మరణిస్తున్నాడు. భార్య ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది. మిత్రులు శ్మశానం వరకు వచ్చిపోతారు. ఎంతో ప్రేమగా పోషించుకున్న శరీరం చితిమంటల్లో భస్మమైపోతుంది. జీవుడితో వెళ్లగలిగేది ధర్మం ఒక్కటే.

🦜 తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమధర్మం. నిస్సహాయులకు, వృద్ధులకు సహాయం అందించడం మానవతా ధర్మం.

🦜 ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని నీవు ఇతరులకు చేయడం నిజమైన ధర్మం.

🦜 ధర్మాన్ని అనుసరించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

🦜 ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది.

🦜 ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ ధర్మం విడవకూడదని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.

🦜🦜 🦜🦜🦜🦜🦜🦜🦜

Related Posts

Post a Comment