
మనుస్మ్రతి మనజాతి పరువును బజారుకీడ్చిన ఓ దుర్మార్గపు ఆలోచన అని చాలా మంది ప్రచారం చేస్తూన్నారు. నిజమే మనుస్మ్రతి లో అనేకాంశాలు నేటి వర్ధమాన పరిస్ధితులకు దూరంగానే ఉన్నాయి.ఓ ఉన్నత వర్గానికి పెద్దపీట వేసి కుల వ్యవస్థలో గందరగోళం సృష్టించి మొత్తం సమాజాన్నే భ్రష్టు పట్టించిందనే మాటను కొందరు భుజాలపైన మొస్తూన్నారు.నిజమే కావచ్చు. వారేవరు మనుస్మ్రతి పూర్తిగా చదివి ఉండరు. అందులోని మంచిని ప్రచారం చేయలేదు.
వారు చదివినా అది ఏ దేశకాల పరిస్ధితులకు అనుగుణంగా ఉందో, ఎందుకు వ్రాశారో,మనుస్మ్రతి తో పాటు ఇంకా ఎన్ని స్మ్రతులున్నాయో వాటి సారాంశమేమిటో అవగాహన చేసుకోలేదు. వారికి అందులోని చెడ్డ మాత్రమే కనబడుతోంది. ఆ చెడ్డ ఎందుకు సృష్టించబడిందో అర్థం చేసుకోవటం లేదు.స్మ్రతులు వ్రాసిన మనపూర్వీకులు అజ్ఞానులుకాదు.యుక్తాయుక్త విచక్షణ కలవారు.
నిజానికి స్మ్రతులలో వున్న చెప్పిన చాలా అసాంఘిక విషయాలు ఆచరణలో నాడే లేవు.
ఉదా॥ స్త్రీలు వేదాలు చదవరాదు. మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి స్త్రీలు వేదాలు చదివి ఔపోసనబట్టారు.
శూద్రులు వేదాలు వింటే వారి చెవులలో కరగించిన సీసం పోయాలి. చరిత్రలోకాని పురాణాలలోకాని ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా ఎక్కడా రికార్డు కాలేదు.
చెడ్డలోవున్న మంచిని కూడా మంచిగానే స్వీకరించాలి.
మన దేశంలో ఈనాడు మనిషి జీవన ప్రమాణం దాదాపు 65 సంవత్సరాలు.వైద్య రంగంలో సాంకేతికత పెరిగింది. పిల్లలు లేని గొడ్రాళ్ళయిన దంపతులు సరోగసి అద్దె గర్భం ద్వారా పిల్లలను కంటున్నారు. భర్త శుక్రకణంతో భార్య అండాన్ని పరీక్షనాళికలో ( Testtube )ఫలదీకరింపచేసి తిరిగి భార్య గర్భంలో ప్రవేశపెడుతున్నారు. లేదా ఇతర స్త్రీల గర్భంలో ప్రవేశపెట్టి బిడ్డ పుట్టిన తరువాత తీసుకుపోతున్నారు. అద్దె గర్భం మోసిన తల్లికి ఏలాంటి హక్కు లేదు. మన దగ్గర దీని గురించి చట్టం లేదు.కాని ఇది ప్రపంచ వ్యా ప్తంగా జరుగుతున్న ఆమోదకర ప్రక్రియ. దీనిని ఎవరు విమర్శించలేదు.
కాని ఇదే విషయాన్ని మనుస్మ్రతి పాటించమని చెప్పింది. మనవారు విమర్శించారు.
భార్య భర్తలలో భర్త పిల్లలు లేకనే మరణిస్తే, అతని వంశం అంతటితో అంతరిస్తుంది. అప్పట్లో రోగాలు, జాడ్యాలు, యుద్ధాలతో జనాభా నశించేది. జనాభా పెరగకపోతే సంఘం ఉండదు. కనుకనే మనుస్మ్రతి నియోగం అనే పద్ధతిని ఆనాడు సూచించింది.
నియోగం అంటే సత్శీలుడైన సగోత్రీకునితో భర్త లేని ఇల్లాలు పిల్లలు కని వంశాభివృద్ధికి పాటుపడాలని మనుస్మ్రతికారుడు తెలియచేశాడు.అదే మనుస్మ్రతికారుడు అన్ని వేళలా నియోగం పనికిరాదని, ఎక్కువచేస్తే సమాజం చెడిపోతుందని అవసరం మేరకే నియోగం వినియోగించాలని తెలిపాడు.నియోగం అనేది పెద్దల అనుమతితో, మంచి నడవడిక గల అదే గోత్రం కలవాడితోనే జరగాలని శాసించారు.
ఇది నేటి సమాజంలో మిడిమిడి జ్ఞానం ఉన్నవారికి కొరుకుడు పడదు..
ఈనాడు ఉన్న కులమత రిజర్వేషన్లను భావితరాలవారు దీనినొక సాంఘిక బుుగ్మతగా భావించవచ్చు. ఈ రోజు మనం మంచి అనుకొన్నది రేపు అంగీకారయోగ్యం కాకపోవచ్చు. ఇదే మనుస్మ్రతికి కూడా వర్తిస్తుంది.
అలాగని మనుస్మ్రతిని భుజంపై మోయమని చెప్పటంలేదు.
అంతేకాదు మనుస్మ్రతి చక్కని నీతిని బోధించింది కూడా.మనుస్మ్రతి శాస్త్రకారుడు ఎంతటి చక్కని నీతి ఆనాడే చెప్పాడు.అది ఈనాటికి కూడా అనుసరణీయం.
"సత్యం బ్రూయాత్ర్పియం బ్రూయాన్నబ్రూయాత్సత్యమప్రియం.
ప్రియం చ నానృతం బ్రూయా దేష ధర్మస్సనాత: "
ఎప్పుడూ సత్యంనే పలకాలి. చెప్పేమాటలు మధురంగా ఉండాలే కాని కఠినంగా ఉండరాదు. కఠినమైన నిజం చెప్పాలంటేనూ కూడా సున్నితంగానే చెప్పాలి. ఇతరులకు మనం చెప్పే అబద్ధం ఎంత సంతోషాన్ని కలిగించినా అటువంటి అసత్యపు మాటలు పలుకరాదు. ఇలాంటివెన్నో మనుస్మ్రతిలో ఉన్నాయి.
మనుస్మ్రతి లోని మంచినే గ్రహించాలి.
ఇలాంటి పోస్టింగ్ పెట్టినపుడు నా కులం గురించి తెలియని మిత్రుడు నువ్వో అగ్రవర్ణం వాడివి అందుకే సమర్ధిస్తున్నావంటు phone చేశాడు. కాదని చెప్పిన పిమ్మట అశ్చర్యం వ్యక్తం చేశాడు.
Post a Comment
Post a Comment