ఒకప్పుడు మన విశాలభారతదేశంలోనే అనేకదేశాలుండేవి. అంటే అనేక దేశాల సమాహారమే భారతదేశమన్నమాట. వాటిని ఛప్పన్న దేశాలనేవారు. 56 సంఖ్యనే సంస్కృతంలో ఛప్పన్న మంటారని విన్నట్టుగా గుర్తు. ఆ యాభైఆరుదేశాలేమిటో చూద్దాం.
(1) అంగ (2) ఆంధ్ర (3) ఆర్య (4) ఏకపాద (5) ఓడ్ర (6) కర్ణాటక (7) కళింగ (8) కాంభోజ (9) కాశ్మీర (10) కాళవ (11) కుంతళ (12) కుకుర (13) కురంగ (14) కేరళ (15) కొంకణ
(16) కొంగు (17) కోరహా (18) కొల్లాళ (19) గాంధార (20) ఘూర్ణర (21) గౌళ (22) ఘోడాముఖి (23) చోళ (24) జీన (25) తురుష్క (26) తళువ (27) తెలుంగ (28) ద్రావిడ (29) నేపాళ (30) పల్లవక
(31) పాంచాల (32) పాండ్య (33) పారియాత్రిక (34) బంగాళ (35) బర్భర (36) బాహ్లిక (37) జెళవ (38) బోలు (39) మగధ (40) మధ్య (41) మలయ (42) మళయాళ (43) మహారాష్ట్ర (44) మారవ(45) మాళవ
(46) లంబకర్ణ (47) లాళ (48) లుబ్దక (49) వంగ (50) సింహళ (51) సింధు (52) సింహ్వణ (53) సుంకర (54) స్త్రీదేశీ (55) హలీర్మాలి (56) హైవ.
ఇదో ప్రాచీన జాబితా కాగా మరోజాబితా ప్రకారం
(1) అంగ (2) వంగ (3) కళింగ (4) కళింగా (5) కేరళ (6) హంసకేరళ (7) సర్వేశకేరళ (8) కాశ్మీర (9) కామరూప (10) మహరాష్ట్ర (11) ఆంధ్ర (12) సౌరాష్ట్ర (13) తెలంగ (14) మలయాల (15) కర్ణాటక
(16) అవంతి (17) విధర్భ (18) మరు (19) అభీర (20) మాళవ (21) చోళ (22) పాంచాళ (23) కాంభోజ (24) విరాట (25) పాండ్య (26) విదేహ (27) బాహ్లిక (28) కిరాత (29) వక్రాంత (30) కురాసన
(31) ఐరిక (32) బోతాంత (33) చీన (34) మహాచీన (35) నేపాళ (36) సిల్హత (37) గౌడ (38) మహాకోసల (39) మగధ (40) కేకత, (41) ఉత్కల (42) శ్రీకుమతల (43) హుణ (44) కొంకణ (45) కైకేయ(46) సౌరసేన (47) కురు (48) లాట (49) సింహళ (50) పుళింద (51) కచ్చ (52) మత్స్య (53) మద్ర(54) సౌవీర (55) భార్బర (56) సాందాన.
వీటిలో మీకు తెలిసినదేశాలెన్ని, అవి ఈ భూమండలంలో ఎక్కడున్నాయో చెప్పగలరా ?

Post a Comment
Post a Comment